మద్యం కుంభకోణంపై విస్తృత తనిఖీలు
. రెండోరోజూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు
. రూ.175 కోట్ల బంగారు నాణేల కొనుగోలుపైనా ఆరా
. కీలక దస్త్రాలు, లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ రెండోరోజు కూడా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈకేసులో నిందితులకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పుర్, దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు రూ.4000 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఈ కుంభకోణంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి మధ్య అమలు చేసిన కొత్త మద్యం విధానం కిందే భారీ మోసాలు జరిగినట్లు గుర్తించింది. డిస్టిలరీలు, మార్కెటింగ్ సంస్థలను బలవంతపెట్టి ఇన్వాయిస్ విలువలో 15`20శాతం వరకు కిక్‌బ్యాక్ వసూలు చేశారు. చెల్లింపుల ఆలస్యం, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించడం, అర్హత నిబంధనలను వక్రీకరణ వంటి విషయాలు ఛార్జిషీట్‌లో ఉన్నాయి. సేకరించిన నిధులను ఎన్నికల ఖర్చులకు, వ్యక్తిగత లాభాల కోసం, విదేశాలకు పంపించడానికి ఉపయోగించారని సిట్ తేల్చింది.దీనిపై దిల్లీలో గత పది రోజులుగా ఈడీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు మూడు ఛార్జిషీట్‌లు దాఖలు చేసిన అంశంపై వారు ఆరా తీశారు. నాలుగు రోజుల క్రితం ఈడీ అధికారులు విజయవాడ వచ్చి సిట్ అధిపతి రాజశేఖర్ బాబుతో చర్చలు జరిపారు. మూడు చార్జిషీట్లు, షెల్ కంపెనీల వివరాలు, సీజ్ చేసిన స్థిర, చరాస్తుల వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, దిల్లీలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.హైదరాబాద్ లోని ఏఆర్‌ఈటీఏ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌ఆర్, ఎల్‌ఎల్‌పీ, సువర్ణ దుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై, సికింద్రాబాద్ లోని రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెల్లరీస్ సహా మరో కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా, చెన్నైలోని ఎంఎస్ మోహన్ లాల్ జ్యువెల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పైనా దాడులు చేశారు. అయితే, ఈ దాడుల్లో హైదరాబాద్ లోని మహదేవ్ జ్యువెల్లరీస్, చెన్నైలోని బంగారం షాపుల్లో కీలక డేటాను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెల్సింది. ఈ నేపథ్యంలో త్వరలోనే కొంతమందికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు జీఎస్టీ బిల్లులు జారీ చేసి చెల్లింపులు జరిపినట్లు గుర్తించిన ఈడీ అధికారులు, దానికి సంబంధించిన కీలక డేటాను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.175కోట్ల విలువైన బంగారు నాణేలు ఎవరి కోసం కొనుగోలు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డేటా, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. పూర్తి నివేదికను ఢల్లీిలో ఉన్న ఉన్నతాధికారులకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఈడీ సిట్ అధికారులను సంప్రదిస్తున్నారు.
The post ఈడీ దూకుడు appeared first on Visalaandhra.
మద్యం కుంభకోణంపై విస్తృత తనిఖీలు . రెండోరోజూ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు. రూ.175 కోట్ల బంగారు నాణేల కొనుగోలుపైనా ఆరా. కీలక దస్త్రాలు, లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ రెండోరోజు కూడా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈకేసులో నిందితులకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పుర్,
The post ఈడీ దూకుడు appeared first on Visalaandhra.
