ఇది చాలా అన్యాయం. నేను సహించను. రేపే ప్రజల్లోకి వెడతా. ఈ దుర్మార్గాన్ని సహించను. ఏంటి బావ దుర్మార్గం సహించను అంటున్నావ్. నీకు తెలియదా రోజూ ఉదయమే పేపరు చదువుతావు కదా. ఒక పక్క కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, మేధావులు గగ్గోలు పెడుతుంటే ఏమీ ఎరగనట్లు నిదానంగా ఏమిటి అంటావేమిటి. అది సరే విషయం ఏంటో చెప్పు. చెప్పడానికేముంది నా బోటి పేదల పిల్లలు డాక్టర్లు కాకూడదనేగా నేటి ప్రభుత్వ పన్నాగం. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తాడంట. ఉన్నవారి పిల్లలే వైద్య కోర్సు చదవాలంట. ఒక పక్క సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పి ప్రభుత్వ కాలేజీలు ఉన్నవారి పరంచేసి సంపద సృష్టిస్తారా. ఏమిటి అన్యాయం. ఇది నీకు కొత్తగా అన్పిస్తోందా. చంద్రబాబు ఆలోచన ఉన్నవారికి ఉపయోగపడి వారి సహాయంతో గద్దెనెక్కడమేనని అనుకుంటున్నారు. ఈ రోజు మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం చేయడం నాకు కొత్తగా అన్పించడంలేదు. అసలు సంపద సృష్టించి ప్రభుత్వం నడిపించే వాడయితే సంపద ఉన్నవారికి లబ్ధి చేకూర్చే పనులు చేయరు. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే పరిశ్రమాధిపతుల నుంచి వసూలు చేయవచ్చుకదా. వారిపై పన్నులు పెంచడం, చందాల ద్వారా వసూలు చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వారికి దారాదత్తం చేయడం సమంజసమేనా? గద్దె నెక్కడానికి అలవికాని సూపర్ సిక్సు లాంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చేతులెత్తేస్తే ఎలా? సంక్షేమ పథకాలు నిలిపివేసి సంపద సృష్టించి తన అనుభవం, తెలివితేటలు నిరూపించవచ్చు గదా.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన దగ్గర నుంచి ప్రతిరోజు జగన్ దుర్మార్గుడని ఖజానా ఖాళీచేసి పోయాడని దుర్మార్గ పాలనలో తన వారికి దోచి పెట్టాడని తిట్టడంతో చేతులు దులుపుకుంటే ప్రజలు మెచ్చుకోరు. జగన్ అనేక తప్పులు చేసి ఉండవచ్చు. ఆ తప్పులు మీరు చేయకుండా ప్రజలు మెచ్చే ఆలోచనతో పాలన చేయవచ్చుకదా. జగన్ నవరత్నాలని పేదలను ఆకర్షిస్తే చంద్రబాబు సూపరు సిక్సు పూర్తిగా అమలు చేయకపోగా పన్నులు పెంచడంలో నిమగ్నమయ్యారు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు లాంటివి పెంచి మధ్య తరగతి వారి నెత్తికి పెంచారు. పన్నులు పెంచకుండా అప్పులు పెంచకుండా మంచి పాలనచేస్తే బాబు తెలివితేటల గమనించి ప్రజలు హర్షం వ్యక్తం చేసి కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతారు.
స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అన్నట్లుగానే ఆగస్టు 15 న ప్రారంభించారు. కాని ఒకపక్క అప్పులు పెంచుతూ ఉచిత బస్సు పథకం అమలుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల తరువాత ఆ పథకం వల్ల వచ్చిన కోట్ల నష్టం వంకతో ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేస్తాడనే అనుమానం కొందరిలో ఉంది. ప్రత్యక్ష పన్నులు కాకుండా పరోక్ష పన్నులు పెంచడంలో బాబు అగ్రగణ్యుడని కొందరు వ్యాఖ్యానించినా కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రత్యక్షంగానేె పెంచారు. ఆదాయ పన్ను శాఖ ద్వారా వేల కోట్లు సంపాదించే వారి జాబితా సంపాదించి వారికి పన్నులు పెంచి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టవచ్చు. కాని ఆ పని ప్రధాని మోదీగాని, చంద్రబాబులాంటి వారుగానీ చెయ్యరు.
ఎందుకంటే ఎన్నికలకు ఫండు వారి నుంచే తీసుకుంటారు గనుక. జగన్ ఎత్తివేసిన అన్నదాన కార్యక్రమాలు బాబు మరల మొదలుపెట్టారు. పేదలకు అందే దానికంటే నడిపేవారి చేతివాటం ఎక్కువయిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా ఎంచుకుని అక్కడ పనుల్లో నిమగ్నమవటం ఎవరికి లబ్ధి చేకూరుతుందో తెలిసిన విషయమే. ప్రతిది ప్రభుత్వం వల్ల కాదని ప్రైవేటుపరం చేయడం ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లుగానే భావించాలి.
సెల్: 9885569394
The post పేదలకు అన్యాయమే appeared first on Visalaandhra.
ఇది చాలా అన్యాయం. నేను సహించను. రేపే ప్రజల్లోకి వెడతా. ఈ దుర్మార్గాన్ని సహించను. ఏంటి బావ దుర్మార్గం సహించను అంటున్నావ్. నీకు తెలియదా రోజూ ఉదయమే పేపరు చదువుతావు కదా. ఒక పక్క కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు, మేధావులు గగ్గోలు పెడుతుంటే ఏమీ ఎరగనట్లు నిదానంగా ఏమిటి అంటావేమిటి. అది సరే విషయం ఏంటో చెప్పు. చెప్పడానికేముంది నా బోటి పేదల పిల్లలు డాక్టర్లు కాకూడదనేగా నేటి ప్రభుత్వ పన్నాగం. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్
The post పేదలకు అన్యాయమే appeared first on Visalaandhra.
