Headlines

సాగునీటి ప్రాజెక్టులకురూ.60 వేల కోట్లు

సమర్థ నీటి నిర్వహణతోనే అభివృద్ధి
. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు
. అసెంబ్లీలో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనులను వివరించారు. భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది తెలిపారు. నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశంపై సీఎం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్‌ రంగంలో ఆడిన డ్రామాలపై రూపొందించిన వీడియోను ముఖ్యమంత్రి సభలో ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి ప్రాజెక్టుల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, ఈ ఐదేళ్లలో మొత్తం రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయని, 94 శాతం రిజర్వాయర్లలో నీళ్లు నింపిన జలవనరుల శాఖను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 1040 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాకే సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు నింపాలన్నారు. శాసనసభ్యులు బాధ్యత తీసుకుని దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. భూగర్భ జలాలను రీఛార్జి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుంటే కరవు అనే మాట రాష్ట్రంలో ఉండదని, ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత కూటమి తీసుకుంటుందని అన్నారు. గత పాలకులు పట్టిసీమ వద్దనడంతో పాటు పోలవరాన్ని నాశనం చేశారని విమర్శించారు. 2019 నాటికి 72 శాతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామన్నారు. గత పాలకుల అసమర్థత వల్ల డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్ట్‌ సంస్థలను మార్చవద్దని కేంద్రం, కేంద్ర జలవనరుల శాఖ చెప్పినా… నాటి వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రూ.వెయ్యి కొట్లతో కొత్తగా డయాఫ్రం వాల్‌ నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు కేవలం 3.84 శాతం మాత్రమేనని అన్నారు. 2021కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును ఏడేళ్లు వెనక్కు నెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందన్నారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని స్పష్టంచేశారు.1987లో ఎన్టీఆర్‌ సంకల్పించిన హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల దూరం నీటిని తరలించి… చిట్టచివరి ప్రాంతానికి తీసుకెళ్లామన్నారు. వంద రోజుల్లోనే రూ.3800 కోట్లు మంజూరు చేసి… 3850 క్యూసెక్కుల నీటిని పారిస్తున్నామని, పులివెందుల చెరువుకు కూడా నీటిని కూటమి ప్రభుత్వమే ఇస్తోందన్నారు. రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటిని నింపేలా ప్రణాళికలు చేసుకున్నామన్నారు. ఆగస్టు 30న కుప్పానికి నీళ్లిచ్చి జలహారతి ఇవ్వటంతో తన జన్మ సార్ధకమైందన్నారు. వంశధార రెండో దశ, తోటపల్లి తారకరామ తీర్ధసాగర్‌, మహేంద్ర తనయ, హీరమండలం, వంశధార-నాగావళి మద్దువలస, నాగావళి-చంపావతి, జంరaావతి, గండిగెడ్డ ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి… ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తామన్నారు. మొత్తం రూ.7803 కోట్లను ప్రాధాన్యతా క్రమంలో ఖర్చు చేసి రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండలో పనులు అసంపూర్తిగా ఉండగానే గత ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు డ్రామాలు ఆడిరదని ఆరోపించారు. రూ.2059 కోట్లతో వచ్చే ఏడాది జులై నాటికి వెలిగొండ నుంచి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాలకు నీళ్లిస్తామని ప్రకటించారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానం చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదుల నుంచి ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 3782 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళ్లాయన్నారు. ఒక్క గోదావరి నుంచే 2882 టీఎంసీల నీరు, కృష్ణా నుంచి 892 టీఎంసీల నీళ్లుసముద్రంలో కలిశాయన్నారు.
ఇలాంటి సమయంలో 200 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి బనకచర్లకు తీసుకెళ్తే…రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. అన్ని రాష్ట్రాలు అంతర్గతంగా తమ రాష్ట్రాల్లోని నదులు అనుసంధానం పూర్తిచేస్తే ప్రపంచానికే ఆహారం అందించే అవకాశం ఉంటుందన్నారు. మెడికల్‌ కాలేజీలపై కూటమి తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికీ నష్టం జరగదని వివరించారు. దూరదృష్టితో ఆలోచించే పీపీపీ విధానం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరు అడ్డు పడినా మంచి నిర్ణయాలను ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

The post సాగునీటి ప్రాజెక్టులకురూ.60 వేల కోట్లు appeared first on Visalaandhra.

​సమర్థ నీటి నిర్వహణతోనే అభివృద్ధి. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు. అసెంబ్లీలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పనులను వివరించారు. భవిష్యత్తులో ఏమేం చేయబోతున్నామనేది తెలిపారు. నీటిపారుదల రంగానికి సంబంధించిన
The post సాగునీటి ప్రాజెక్టులకురూ.60 వేల కోట్లు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *