
Mohammad Nabi : ఆసియాకప్ 2025లో అఫ్గానిస్తాన్ ప్రయాణం ముగిసింది. సూపర్ 4కి చేరుకోవాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi)మెరుపులు మెరిపించాడు. కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 60 పరుగులు చేశాడు. ముఖ్యంగా లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.
విషాదం..
అయితే.. ఈ మ్యాచ్ జరుగుతుండగానే స్పిన్నర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే చనిపోయాడు. ఈ విషయం ఇన్నింగ్స్ విరామ సమయంలోనే శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలిసింది. అయినప్పటికి తండ్రి మృతి చెందిన విషయాన్ని వారు స్పిన్నర్‌కు తెలియనివ్వలేదు. మ్యాచ్ ముగిసిన తరువాత హెడ్‌కోచ్ సనత్ జయసూర్య ఈ విషయాన్ని స్వయంగా దునిత్ వెల్లలాగేకే చెప్పాడు.
No son should go through this
Jayasuriya & team manager right after the game communicated Dinuth Wellalage the news of his father’s passing away.pic.twitter.com/KbmQrHTCju
— Rajiv (@Rajiv1841) September 18, 2025
22 ఏళ్ల స్పిన్నర్ దుఖఃసాగరంలో మునిగిపోగా అతడిని కోచ్ జయసూర్య ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహ్మద్ నబీ ఈ విషయం చెప్పగానే..
కాగా.. ఈ మ్యాచ్‌లో దునిత్ వెల్లలాగే బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన మహ్మద్ నబీకి ఈ విషయాన్ని విలేకరులు తెలియజేశారు. దునిత్ తండ్రి గుండెపోటుతో మరణించాడని చెప్పారు. ఈ విషయం విన్న నబీ షాక్ అయ్యాడు.
The moment when Mohamed Nabi was informed about the sudden demise of Dunith Wellalage’s father. Mohamed Nabi hit 5 sixes of Dunith Wellalage’s bowling in the last over of Afghanistan’s innings. pic.twitter.com/sjfAUzQvE6
— Nibraz Ramzan (@nibraz88cricket) September 18, 2025
ఆ తరువాత సోషల్ మీడియా వేదికగా దునిత్ వెల్లలాగేకు ధైర్యం చెప్పాడు. దునిత్ తో పాటు అతడి కుటుంబానికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేశాడు.
Heartfelt condolences to Dunith Wellalage and his family on the loss of his beloved father.
Stay strong Brother pic.twitter.com/d6YF2BhlnV— Mohammad Nabi (@MohammadNabi007) September 18, 2025
తాను ఐదు సిక్సర్లు కొట్టిన బౌలర్ తండ్రి చనిపోయాడు అని చెప్పగానే అఫ్గాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (Mohammad Nabi) షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

