గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి..

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ముదిగుబ్బ రెవిన్యూ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన వీఆర్ఏలకు సిపిఐ పార్టీ నాయకులు మద్దతు పలికారు, ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో తాసిల్దార్ నారాయణ స్వామికి అందజేశారు, అనంతరం దీక్షలో పాల్గొన్న సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్ఏల సమస్యలను
ఏ ప్రభుత్వం వచ్చినాసమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. మారుమూల గ్రామాల్లో చిన్న సంఘటన జరిగిన వెంటనే మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారులకు సమాచారం చేరవేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరణలో కీలక పాత్ర గ్రామ రెవెన్యూ సహాయకులేనని ఆయన తెలిపారు, ఈ నేపథ్యంలో వీఆర్ఏలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పరిష్కరించడానికి చర్యలు తీసుకోకపోగా వారి పని భారాన్ని మాత్రం పెంచుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు నెలకు 20 వేల రూపాయలు జీతం అందించడంతోపాటు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు అర్హులైన వారికి పదోన్నతులు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విఆర్ఎ లతో కలిసి త్వరలోనే చలో అమరావతి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ స్థానిక నాయకులు గంగిరెడ్డిపల్లి నాయుడు, ముత్తులూరి మధు, లింగోట్ల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

The post గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి.. appeared first on Visalaandhra.

​సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ముదిగుబ్బ రెవిన్యూ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన వీఆర్ఏలకు సిపిఐ పార్టీ నాయకులు మద్దతు పలికారు, ఈ
The post గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి.. appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *