ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఏపీలో ఈ రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎనిమిది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక ఇచ్చారు.
ఈ జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులతో కలసి కురిసే అవకాశం ఉందని చెప్పారు. .
తెలంగాణలో భారీ వర్షాలు
అదేవిధంగా, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని వాతావరణ శాఖ తెలిపింది.గత రెండు-మూడు రోజులుగా సాయంత్రం కాలంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం
లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ రోజు, రేపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ఈ అల్పపీడనం దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భల నుండి దక్షిణ మరత్వాడ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తన వరకు వ్యాపిస్తోంది.ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటకల నుండి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు 3.1 కి.మీ ఎత్తులో ఈ ద్రోణి ఏర్పడింది.
The post బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక appeared first on Visalaandhra.
ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఏపీలో ఈ రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎనిమిది జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక ఇచ్చారు.ఈ జిల్లాలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. అక్కడక్కడ మోస్తరు నుంచి
The post బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక appeared first on Visalaandhra.
