Headlines

రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు

సీఈఓ సుదర్శన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలను చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం డి లిస్టింగ్‌ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్‌ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్‌ ఇండియా ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్‌ లేబర్‌ ప్రజా పార్టీ, లోక్‌ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్‌ నేషనల్‌ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్‌ పార్టీ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదనీ, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం-1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని వివరించారు. రద్దయిన పార్టీలు ప్రధానంగా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు చెందినవే. వీటిలో నాలుగు పార్టీలు హైదరాబాద్‌కు, మరో నాలుగు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు, ఒకటి భద్రాద్రి-కొత్తగూడెంకు చెందినది. ఈ నిర్ణయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించామనీ, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని సుధర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కాపాడడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

The post రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు appeared first on Navatelangana.

​సీఈఓ సుదర్శన్‌ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలను చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం డి లిస్టింగ్‌ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్‌ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్‌ ఇండియా ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్‌ లేబర్‌ ప్రజా పార్టీ, లోక్‌ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్‌ నేషనల్‌ పార్టీ, తెలంగాణ
The post రాష్ట్రంలో 9 గుర్తింపులేని రాజకీయ పార్టీలు రద్దు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *