Headlines

Microsoft: రేపటిలోగా అమెరికా వచ్చేయండి.. హెచ్‌-1బీ వీసాదారులకు మైక్రోసాఫ్ట్‌ ఆదేశాలు..

Microsoft Instructs H1b And H4 Visa Holders Abroad To Return To The Us By September 21

Microsoft: హెచ్‌-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు అంతర్గత ఈ-మెయిల్‌ పంపించినట్లు రాయిటర్స్‌ కథనాలు ప్రచురించింది. అయితే, యూఎస్ లోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్త్ కోసం ఇక్కడే తమ పనిని కొనసాగించాలని ఆ సంస్థ సూచించినట్లు తెలుస్తుంది.

Read Also: Pawan Vs Bonda Uma: కూటమిలో పొల్యూషన్ బోర్డు తుఫాన్.. బోండా వర్సెస్ పవన్ మధ్య మాటల యుద్ధం..!

అయితే, డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు ఈ మేరకు సూచనలు జారీ చేసింది. దీంతో పాటు ప్రముఖ టెక్‌ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టులలో ఉంచడానికి చాలా కాలంగా హెచ్‌-1బీ వీసాలను ఉపయోగిస్తున్నాయి. కాగా, హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది.. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉండేది.. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తుంటాయి. తాజాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలకు పెను భారంగా మారబోతుంది. ఇకపై యూఎస్ వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

​Microsoft: హెచ్‌-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *