— నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించిన వీర చంద్రహాస చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ప్రముఖ చిత్ర నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము విజ్ఞప్తి చేశారు. వీరచంద్రహాస చిత్రం విడుదల సందర్భంగా స్థానిక శివ జ్యోతి ధియేటర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులు కేవలం సోషల్ చిత్రాలే కాకుండా ఇలాంటి సంస్కృతి ఆధారిత చిత్రాలను చూసి ప్రోత్సహించాలన్నారు. “లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం, దర్శకత్వం వహించారని, ఈ చిత్రాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎంతో హృద్యంగా మలిచారన్నారు. తాను ఇప్పటి వరకు నువ్వు తోపురా, కిల్లర్ ఆర్టిస్టు , మరియా లాంటి చిత్రాలు నిర్మించానని, ఇది తన నాలుగో చిత్రమని ఆయన అన్నారు. తాను 2018లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చానని, సాఫ్ట్ వేర్ రంగంలో విదేశాలలో ఉన్నప్పటికీ సినిమాల మీద ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశానన్నారు. ఇదో కళాత్మక చిత్రమని , రాబోయే రోజుల్లో కధా బలంతో ఉన్న మరిన్ని చిత్రాలు నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తన చిత్రాలలో ప్రతిభ ఉన్నవారందరికీ అవకాశం కల్పిస్తున్నానని, కొత్తదనంతో కూడుకున్న కథలను తాను తెరకెక్కించాలనుకుంటున్నానన్నారు. ఈ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించిందని, ఇపుడు తెలుగులో దీనిని విడుదల చేశామన్నారు. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్, ఎస్‌జే కే బ్యానర్స్‌పై మరో నిర్మాత ఎమ్.వి. రాధాకృష్ణతో కలిసి తానీ చిత్రాన్ని నిర్మించానన్నారు. ఇది భారతీయ సంస్కృతిని, యక్షగానం సంప్రదాయాన్ని అందించే చిత్రమని , . తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
The post కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించిన వీర చంద్రహాస చిత్రాన్ని ఆదరించండి appeared first on Visalaandhra.
— నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించిన వీర చంద్రహాస చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ప్రముఖ చిత్ర నిర్మాత డా. జేమ్స్ వాట్ కొమ్ము విజ్ఞప్తి చేశారు. వీరచంద్రహాస చిత్రం విడుదల సందర్భంగా స్థానిక శివ జ్యోతి ధియేటర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులు కేవలం సోషల్ చిత్రాలే కాకుండా ఇలాంటి సంస్కృతి ఆధారిత చిత్రాలను చూసి ప్రోత్సహించాలన్నారు.
The post కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించిన వీర చంద్రహాస చిత్రాన్ని ఆదరించండి appeared first on Visalaandhra.
