రాష్ట్రమంతా సౌభాగ్యంగా ఉండాలి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
వరంగల్‌లో బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం
పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, జూపల్లి
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రులు

నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ప్రకృతిలో లభించే అనేక రకాల పూలతో తొమ్మిది రోజులపాటు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య ప్రదర్శనతో పాటు వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభం అయిందని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా ఎదగడంతో పాటు శక్తివంతులుగా ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటల సీడీని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజ్‌, గండ్ర సత్యనారాయణ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

The post రాష్ట్రమంతా సౌభాగ్యంగా ఉండాలి appeared first on Navatelangana.

​డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వరంగల్‌లో బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంపాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, జూపల్లిమహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రులు నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తాప్రకృతిలో లభించే అనేక రకాల పూలతో తొమ్మిది రోజులపాటు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రాత్రి తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య
The post రాష్ట్రమంతా సౌభాగ్యంగా ఉండాలి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *