నవతెలంగాణ-హైదరాబాద్ : హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తాజాగా ఓ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైమ్ ఫీజు మాత్రమేనని వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు.
హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.
The post హెచ్ 1బీ వీసా ఫీజుపై వైట్‌హౌస్ స్పష్టత appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తాజాగా ఓ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైమ్ ఫీజు మాత్రమేనని వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్
The post హెచ్ 1బీ వీసా ఫీజుపై వైట్‌హౌస్ స్పష్టత appeared first on Navatelangana.
