Headlines

Hydra: గాజులరామారంలో “హైడ్రా” ఆపరేషన్.. 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి..

Hydra Demolitions At Gajularamaram In Qutubullapur

హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.

Also Read:Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభం.. సద్దుల బతుకమ్మతో ముగింపు – పండుగ ప్రత్యేకతలు

కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలను మాత్రమే తొలగిస్తామని హైడ్రా చెబుతోంది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిలో బడా బాబుల ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయాలు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హైడ్రా తెలిపింది. పేదవారిని ముందు పెట్టి.. బడాబాబులు వేయించిన షెడ్డుల తొలగించారు.

​హైడ్రా ఏర్పాటయ్యాక కబ్జారాయుళ్ల నుంచి వందల ఎకరాల భూమి రక్షించారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా కుత్బుల్లాపూర్ లోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ సర్వే నెంబర్ 307 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టింది. రూ. 15 వేల కోట్ల విలువైన భూమికి కంచె వేసేందుకు రెడీ అయ్యింది హైడ్రా.. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి లభించింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *