Headlines

Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!

Smriti Mandhana Smashes 50 Ball Century Creates History In Odi Cricket

టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన స్మృతి 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

మూడో వన్డేలో స్మృతి మంధాన మొదటి నుంచే హిట్టింగ్ చేసింది. ఈ క్రమంలో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 బంతుల్లో సెంచరీ చేసింది. దాంతో 57 బంతుల్లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు కారెన్ రోల్టన్, బెత్ మూనీ పేరిట ఉన్న రికార్డును స్మృతి బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ సెంచరీ రికార్డ్ ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లాన్నింగ్ పేరిట ఉంది. 2013లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో సెంచరీ చేసింది. ఈ జాబితాలో ప్రస్తుతం స్మృతి రెండో స్థానంలో ఉంది. స్మృతి గతంలో 70, 77 బంతుల్లో శతకం బాదింది. హర్మన్ ప్రీత్ కౌర్ 82 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది.

Also Read: Hardik Pandya: అనవసర హైప్‌ వద్దు.. పాకిస్థాన్‌తో ఆడబోయేది మామూలు మ్యాచే!

మహిళల వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీలు:
45- మెగ్ లానింగ్ vs న్యూజిలాండ్, నార్త్ సిడ్నీ ఓవల్, 2012
50- స్మృతి మంధాన vs ఆస్ట్రేలియా, ఢిల్లీ, 2025*
57- కరెన్ రోల్టన్ vs దక్షిణాఫ్రికా, లింకన్, 2000
57- బెత్ మూనీ vs ఇండియా, ఢిల్లీ, 2025*
59- సోఫీ డివైన్ vs ఐర్లాండ్, డబ్లిన్, 2018
60- చమరి అటపట్టు vs న్యూజిలాండ్, గాలే, 2023

మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు:
15 – మెగ్ లానింగ్
13 – సుజీ బేట్స్
13 – స్మృతి మంధాన
12 – టామీ బ్యూమాంట్

​టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *