ఆ ఉద్యోగి చెప్పిందే వేదం
సతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలు
విశాలాంధ్ర -చిలమత్తూరు (శ్రీ సత్యసాయి జిల్లా) : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిరుపేదల కోసం ప్రవేశపెట్టినది ఈ పథకంలో ఉద్యోగి అవినీతి తిమింగలం గా మారాడని తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అవినీతికి అంతం లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి, హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలయ్య ఇలాఖలో మారుమూల అటవీ ప్రాంతంలో నెలకొన్న ఆ గ్రామంలో కూలి చేసుకుంటూ గతంలో కట్టెలు కొట్టి జీవనం సాగిస్తున్న ఆ నిరుపేదల కోసం ప్రభుత్వాలు వారి బ్రతుకులలో వెలుగు చూడాలని ఉద్దేశంతో ఉపాధి హామీని ప్రవేశపెట్టినది అయితే ఇదే అదనగా ఓ ఉద్యోగి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ పనిచేసే కూలీలకు జాబ్ కార్డులు చేయించకుండా బినామీల పేరుమీద పనులు చేయిస్తూ బిల్ సరిగా చెల్లించకపోవడం ఒకటైతే, కొంతమందితో చేతులు కలిపి లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు విశ్వసనీయ సమాచారం, విధులు సక్రమంగా నిర్వహించకుండా వారానికి ఒకటి రెండు సార్లు ఫీల్డ్ విజిట్ చేసి ఇతని స్థానంలో ఇతరులను పంపిస్తూ ఫోటోలు తీసి మమ అనిపిస్తున్నాడని ఆ నిరుపేదలు పెదవి విరిచారు, గతంలో చెరువు సరిహద్దులలో, మరువ వంకలో, కానుక చెట్ల నార్వ వంకలో చేసిన పనులకు గాను బిల్లులే చెల్లించలేదని కూలీలు వాపోయారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టి అవినీతికి పాల్పడుతున్నాడని చర్చించుకుంటున్నారు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహార శైలి ఉన్నతాధికారులకు తెలిసిన ను మిన్న కుండిపోవడంతో వారిని సైతం మేనేజ్ చేశాడేమోనని సమాచారం. దీంతో ఆ గ్రామంలో ఉపాధి హామీ పనులు అంటే చిరాకు పడుతున్నారంటే ఆ ఉద్యోగి పనితీరు ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పవచ్చు, ఇంత అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగిపై సంబంధిత అధికారులు స్పందించి నిరుపేదలకు న్యాయం చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి వేచి చూద్దామా ఎమ్మెల్యే బాలయ్య ఇలాఖలో ఆ అవినీతి ఉద్యోగిపై చర్యలు ఎలా ఉంటాయో.
ఎంపీడీవో రమణ మూర్తి వివరణ,….
ఉపాధి హామీలో కూలీగా పనిచేసే ప్రతి ఒక్కరి కి జాబ్ కార్డు తప్పనిసరి గా ఉండాలన్నారు, ఉపాధి హామీ బిల్లులు జులై వరకు మంజూరు చేశామన్నారు, గతంలో ఎవరికి కూడా బిల్లులు పెండింగ్ లేవన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ పనులు వద్దకు తప్పనిసరిగా ప్రతిరోజు హాజరు కావాలన్నారు, పై విషయాలలో నిబంధనలు తప్పితే అట్టి వారిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయన్నారు.
The post ఉపాధి హామీలో అవినీతి తిమింగలం… appeared first on Visalaandhra.
ఆ ఉద్యోగి చెప్పిందే వేదంసతమతమవుతున్న ఉపాధి హామీ కూలీలువిశాలాంధ్ర -చిలమత్తూరు (శ్రీ సత్యసాయి జిల్లా) : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిరుపేదల కోసం ప్రవేశపెట్టినది ఈ పథకంలో ఉద్యోగి అవినీతి తిమింగలం గా మారాడని తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి చిలమత్తూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అవినీతికి అంతం లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి, హిందూపురం నియోజకవర్గం
The post ఉపాధి హామీలో అవినీతి తిమింగలం… appeared first on Visalaandhra.
