అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర
విశాలాంధ్ర పార్వతీపురం:సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్ సి సి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెరకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే విజయచంద్ర ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంతో పాటు బొబ్బిలి నియోజకవర్గంలోని రైతులు అధికంగా చెరకును పండించేవాళ్ళనీ, ఈప్రాంతంలో ప్రధానవాణిజ్య పంటగా రైతులు భావించేవారని తెలిపారు. ఈప్రాంతాలకు చెందిన చెరకు రైతులంతా కర్మాగారాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున చెరుకును పండించే వారని తెలిపారు. అప్పట్లో ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీకి సుమారుగా రెండు లక్షల టన్నుల కు పైగా చెరుకు ఉత్పత్తి అయ్యేదన్నారు. గత వైసిపి ప్రభుత్వ పాలనలో ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగిందని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన సీనియర్ ఉద్యోగులకు పిఎఫ్ గాని, గ్రాడ్యుటీ ఇతర బకాయిలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఈఫ్యాక్టరీలో పనిచేసిన పిఎఫ్ హోల్డర్స్, సీనియర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారని, వాళ్ళ కుటుంబాలకు
ఎటువంటి బెనిఫిట్స్ రావడంలేదని, దీంతో వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చెరకు రైతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎన్ సి సి చక్కెరఫ్యాక్టరీని తిరిగి పున ప్రారంభించాలని కోరారు. ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రత్యేక కమిటీని వేయించాలని, చెరకు రైతుల, ఫ్యాక్టరీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. చెరకు
సమస్యలపై సంబంధిత శాఖ మంత్రికి కూడా విన్నవించడం జరిగిందన్నారు.
ఈఅసెంబ్లీ సమావేశం వేదికగా స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రికి, అలాగే సంబంధిత షుగర్ కేన్ అధికారులకు,కార్మికశాఖఅధికారులకు వేడుకున్నది ఒక్కటేఅని,
అది మా పార్వతీపురం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న ఎన్ సి ఎస్ షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి, అందులో పని చేసిన సీనియర్ ఉద్యోగులకు పిఎఫ్ గ్రాడ్యుటీ మంజూరు, ఉద్యోగులను కొనసాగించడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ కోసం సంబంధిత మంత్రి, షుగర్ కేన్,కార్మికశాఖ అధికారులు వచ్చి పరిశీలించాలని కోరారు
The post ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి appeared first on Visalaandhra.
అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రవిశాలాంధ్ర పార్వతీపురం:సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్ సి సి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెరకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే విజయచంద్ర ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంతో పాటు బొబ్బిలి నియోజకవర్గంలోని రైతులు అధికంగా చెరకును పండించేవాళ్ళనీ, ఈప్రాంతంలో ప్రధానవాణిజ్య పంటగా రైతులు భావించేవారని తెలిపారు. ఈప్రాంతాలకు చెందిన చెరకు
The post ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి appeared first on Visalaandhra.
