నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం..

చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమా విడుదలై సోమవారంతో 47 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ’22 సెప్టెంబర్‌ 1978.. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమ. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవ మర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నా’ అని పోస్ట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్‌ రావిపూడితో ‘మన వరశంకరప్రసాద్‌ గారు’, వశిష్టతో ‘విశ్వంభర’, దర్శకులు శ్రీకాంత్‌ ఓదెల, బాబీతో చిరు సినిమాలు చేస్తున్నారు.

The post నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం.. appeared first on Navatelangana.

​చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమా విడుదలై సోమవారంతో 47 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ’22 సెప్టెంబర్‌ 1978.. కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా చిరంజీవిగా మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా,
The post నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *