Headlines

Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు అలర్ట్.. బయటకు రావొద్దు..

Hyderabad Rains

Hyderabad Rains : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. నగరాన్ని క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్‌లో వర్షం కుమ్మేస్తోంది. ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

​Hyderabad Rains : హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. ఇవాళ రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *