Headlines

కేరళ మోడల్‌ దేశానికే ఆదర్శం

నేను నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివాం : కేరళ ఎంపీ శివ దాసన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేరళ వామపక్ష ప్రభుత్వం విద్య, వైద్య సంస్థలను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతోందనీ, ఆ ప్రభుత్వంలో ప్రత్యమ్నాయ విధానాలు దేశానికే ఆదర్శమని కేరళ పార్లమెంట్‌ సభ్యులు శివదాసన్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య పార్క్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో వాకర్స్‌తో ఆ క్లబ్‌ ప్రెసిడెంట్‌ పివి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివదాసన్‌ మాట్లాడుతూ తాను ప్రాథమిక విద్య నుంచి పీహెచ్‌డీ వరకు నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని తెలిపారు. ప్రస్తుతం తన పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని చెప్పారు. ఇది కేరళ వామపక్ష ప్రభుత్వం యొక్క ప్రత్యామ్నాయ విధానానికి నిదర్శనమని వివరించారు. అక్షరాస్యతలో నూటికి నూరు శాతం ప్రగతి సాధించిన కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అక్కడ ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, దవాఖాన, లైబ్రరీ, పార్కులు, జిమ్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. తెలంగాణలో పేదల ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలిస్తే ,కేరళ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తున్నదని చెప్పారు. తమ రాష్ట్రంలో మతకలహాలకు చోటు లేదన్నారు. సంపూర్ణ మతసామరస్యతను అమలు చేస్తూ దేశ సమైక్యతకు బాసటగా నిలుస్తోందని చెప్పారు వాకర్స్‌ సంఖ్యను మరింత పెంచుతూ ప్రజల ఆరోగ్యాలకు వైద్యంతో పాటు వ్యాయా మం కూడా అవసరమని చెప్పారు. వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు ఈ సందర్భంగా శివదాసన్‌తోపాటు కేరళ ఎమ్మెల్యేలు శాంతకుమారి, డీకే మురళీగోపాల్‌ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ లింగా ప్రకాష్‌, మాజీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ వి నాగభూషణం పార్క్‌ వాకర్స్‌ క్లబ్‌ సెక్రటరీ మనోహర్‌ రెడ్డి, కోశాధికారి ఎం దశరథ్‌, ఏరియా మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ సంపత్‌ రెడ్డి, ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంకా మురళి కృష్ణ మాజీ ప్రెసిడెంట్లు సలిపేల రమేష్‌ రెడ్డి, కందూరి కృష్ణ, శైలజ మోహన్‌, వర్కర్స్‌ క్లబ్‌ సభ్యులు టీ స్కైలాబ్‌ బాబు, నిమ్మల రాజశేఖర్‌, ఆర్‌ వెంకట్రాములు, కోట రమేష్‌, కల్లూరి రమేష్‌, డాక్టర్‌ సునీల్‌, రత్నాకర్‌ రెడ్డి, కె వీరయ్య, జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

The post కేరళ మోడల్‌ దేశానికే ఆదర్శం appeared first on Navatelangana.

​నేను నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివాం : కేరళ ఎంపీ శివ దాసన్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేరళ వామపక్ష ప్రభుత్వం విద్య, వైద్య సంస్థలను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతోందనీ, ఆ ప్రభుత్వంలో ప్రత్యమ్నాయ విధానాలు దేశానికే ఆదర్శమని కేరళ పార్లమెంట్‌ సభ్యులు శివదాసన్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లి సుందరయ్య పార్క్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో వాకర్స్‌తో ఆ క్లబ్‌ ప్రెసిడెంట్‌ పివి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
The post కేరళ మోడల్‌ దేశానికే ఆదర్శం appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *