”శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డి కొలాబ్రేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
ఆదివారం ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ, వీఎఫ్‌ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్‌ఆర్, లైన్ ప్రొడ్యూసర్ – దశరథ, సమర్పణ -ఉర్వీష్ పూర్వజ్, నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి, రచన దర్శకత్వం – పూర్వాజ్.
The post తొలి భారతీయ సూపర్ షీ సినిమా appeared first on Navatelangana.
”శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ ‘కిల్లర్’ అనే సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్
The post తొలి భారతీయ సూపర్ షీ సినిమా appeared first on Navatelangana.
