అలా ఏం ఉండదు..
మోయలేనంత బరువుగా తూచలేనంత అధికంగా
ఇలా కూడా ఉండదు.. చెప్పలేనంత మధురంగా
హృదయంలో మిగిలిపోయేంత ఉల్లాసంగా
అప్పుడప్పుడు ఊరిస్తుంది
కొత్త నెత్తుటి పరుగులా ఊగిస్తుంది
అమాంతం దుఃఖ సంద్రంలోకి తోసేసి మోసగిస్తుంది
అంతలోనే అరచేతుల్లోకి తీసుకొని లాలిస్తుంది
జీవితమంటే ఇంతే.. ఎంతో ఉందని అడుగు వేసేంతలో
పాదానికి శూన్యమై తగులుతుంది
అంతా అయిపోయిందని రెప్పలు వాల్చుకుంటే
ఇంద్రధనస్సు వాకిళ్ళు తెరిచి
కలల ప్రపంచంలోకి ప్రేమగా విసిరికొడుతుంది
- సునీత గంగవరపు, 9494084576
The post ద్వైతం.. appeared first on Navatelangana.
అలా ఏం ఉండదు..మోయలేనంత బరువుగా తూచలేనంత అధికంగాఇలా కూడా ఉండదు.. చెప్పలేనంత మధురంగాహృదయంలో మిగిలిపోయేంత ఉల్లాసంగాఅప్పుడప్పుడు ఊరిస్తుందికొత్త నెత్తుటి పరుగులా ఊగిస్తుందిఅమాంతం దుఃఖ సంద్రంలోకి తోసేసి మోసగిస్తుందిఅంతలోనే అరచేతుల్లోకి తీసుకొని లాలిస్తుందిజీవితమంటే ఇంతే.. ఎంతో ఉందని అడుగు వేసేంతలోపాదానికి శూన్యమై తగులుతుందిఅంతా అయిపోయిందని రెప్పలు వాల్చుకుంటేఇంద్రధనస్సు వాకిళ్ళు తెరిచికలల ప్రపంచంలోకి ప్రేమగా విసిరికొడుతుంది
The post ద్వైతం.. appeared first on Navatelangana.
