– శిధిలం అయిపోతున్న రైతు బజార్
విశాలాంధ్ర – సీతానగరం: ఉపయోగంలోకి రాకుండానే శిథిలావస్థకు ‘రైతు బజార్’. మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దగ్గర్లో రైతు బజార్ నిర్మించి సుమారు 8 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఉపయోగంలోకి రాకపోగా అది పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరుతుంది. 2015 నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ పాలనలో నాటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముందు చూపుతో ఈ నిర్మాణం చేసి ప్రారంబించారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతు బజార్ ను మళ్ళీ ప్రారంభోత్సవం చేశారు కానీ అప్పటి నుండి నేటి కూటమి ప్రభుత్వంలో కూడా ఈ రైతు బజార్ ను వాడుకలోకి రకపోవడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు బజార్ వాడుకలోకి వస్తె రఘుదేవపురం ప్రధాన ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో గల మాంసం, కూరగాయల దుకాణాలను అక్కడకు తరలిస్తే సెంటర్లో ట్రాఫిక్ తగ్గుతుంది అని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నత అధికారులు, నాయకులు చర్యలు చేపట్టి శిథిలం అయిపోతున్న రైతు బజార్ ను వాడుకలోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
The post ప్రారంభమలకే పరిమితం అయిన రైతు బజార్ appeared first on Visalaandhra.
– శిధిలం అయిపోతున్న రైతు బజార్ విశాలాంధ్ర – సీతానగరం: ఉపయోగంలోకి రాకుండానే శిథిలావస్థకు ‘రైతు బజార్’. మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దగ్గర్లో రైతు బజార్ నిర్మించి సుమారు 8 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ఉపయోగంలోకి రాకపోగా అది పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరుతుంది. 2015 నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ పాలనలో నాటి టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సుమారు 20 లక్షల రూపాయల
The post ప్రారంభమలకే పరిమితం అయిన రైతు బజార్ appeared first on Visalaandhra.
