కార్తీక మాసం హరిహర మహా క్షేత్రంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు.
— ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ.
విశాలాంధ్ర – కడియం : ఈనెల 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరిగే హరి హరులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా గౌతమి నది తీరాన గల రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక శ్రీ హరి హర మహా క్షేత్రమైన శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి పంచాయాతన క్షేత్రంలో సప్తదశ (17)వ కార్తీక మాస మహోత్సవం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ తెలిపారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి దేవరభట్ల శ్రీనివాస శర్మ (నాని) మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనునట్లు తెలిపారు. ఈ కార్తీక మాసంలో గల 4 సోమవారాలకు సంబంధించి అభిషేకాలు నిర్వహించుకునే భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు కాలువ రేవులు వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు కాలువ రేవులను పరిశీలించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్తీక మాస దీపోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. నవంబరు 18వ తేదీ మంగళవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని భారీ అన్నదానాన్ని ఆలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు జాతీయ రహదారిపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కడియం సిఐ ఏ వెంకటేశ్వరరావు, ఎస్సైలు బి నాగ దుర్గ ప్రసాద్, పి ధనలక్ష్మి ప్రసన్న ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెనుమాక శ్రీను, చిట్టాల సత్తిబాబు, ఆరేటి వీరభద్రరావు, మల్లు రాజు, మల్లు పొలరాజు, చెక్కపల్లి గోవిందు, పంతం శ్రీను, నక్క ప్రసాదు, మల్లు ప్రసాదు, మండల కృష్ణ, ఆలా పెద్దబాబు పాల్గొన్నారు.
The post భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు appeared first on Visalaandhra.
కార్తీక మాసం హరిహర మహా క్షేత్రంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు. — ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ. విశాలాంధ్ర – కడియం : ఈనెల 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు జరిగే హరి హరులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా గౌతమి నది తీరాన గల రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక శ్రీ హరి హర మహా క్షేత్రమైన శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి పంచాయాతన క్షేత్రంలో
The post భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు appeared first on Visalaandhra.
