రష్యా చేతిలో అధునాతన క్షిపణి

బూరెవెస్ట్‌నిక్‌ ప్రయోగం సక్సెస్‌
అణుశక్తి..అపరిమిత పరిధితో తయారీ

మాస్కో : రష్యా అమ్ములపొది లో సరికొత్త అస్త్రం వచ్చి చేరనుంది. అణుశక్తితో నడిచే ‘బూరెవెస్ట్‌నిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాన్ని దేశాధినేత పుతిన్‌ ప్రకటించారు. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు. రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పుతిన్‌ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే రష్యా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఇతర సైనిక కమాండర్లతో ఆయన ఓ సమావేశంలో మాట్లాడారు.

పరీక్షల సమయంలో ‘బూరెవెస్ట్‌నిక్‌’ క్రూయిజ్‌ క్షిపణి 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. అంతకుముందు సైనిక ఉన్నతాధికారులతో పుతిన్‌ భేటీ అయ్యారు. రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్‌ వాలెరీ గెరాసిమోవ్‌ నేతృత్వంలోని కమాండర్లతో సంభాషించారు. 10వేల మందికిపైగా ఉక్రెయిన్‌ సైనికులను చుట్టుముట్టినట్లు గెరాసిమోవ్‌ వివరించారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్‌ సాయుధ దళాల బృందాన్ని అడ్డుకున్నట్టు చెప్పారు.

The post రష్యా చేతిలో అధునాతన క్షిపణి appeared first on Navatelangana.

​బూరెవెస్ట్‌నిక్‌ ప్రయోగం సక్సెస్‌అణుశక్తి..అపరిమిత పరిధితో తయారీ మాస్కో : రష్యా అమ్ములపొది లో సరికొత్త అస్త్రం వచ్చి చేరనుంది. అణుశక్తితో నడిచే ‘బూరెవెస్ట్‌నిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ విషయాన్ని దేశాధినేత పుతిన్‌ ప్రకటించారు. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు. రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పుతిన్‌ వాటిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే రష్యా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌
The post రష్యా చేతిలో అధునాతన క్షిపణి appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *