Headlines

Madhu Yaskhi Goud: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ రెఫరెండంగా తీసుకుంటుందా? 10టీవీ వీకెండ్ లో మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

Madhu Yaskhi Goud

Madhu Yaskhi Goud: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు అంశాలపై మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగబోతోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా తీసుకుంటుందా? ఓడిపోతే.. పాలనా వైఫల్యంగా అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు యధుయాష్కీ గౌడ్ ఏమని చెప్పారంటే..

”సింగిల్ గా జరిగే ఎన్నిక ఏదైనా కూడా రెఫరెండం కాదు. అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దీన్ని రెఫరెండంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కో ఉపఎన్నిక స్థానిక సమస్యలపై జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మనకు చాలా కీలకం. ఇది గెలిచి తీరాలి. దీని కోసం ఒక ప్రణాళిక రచించమని ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్ కి చెప్పాను.

క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే అలా కాకూడదనే అలర్ట్ చేశాను. జనరల్ గా ఉపఎన్నికలో అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కనిపిస్తోంది” అని మధుయాష్కీ గౌడ్ అన్నారు.

Also Read: ఆనాడు బీఆర్ఎస్ విలీనానికి అడ్డంకి ఎవరు? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో మధుయాష్కీ కీలక వ్యాఖ్యలు

 

​క్యాంపెయినింగ్ కమిటీగా ఆరు నెలల నుంచి నేను ఇదే మాట చెబుతున్నా. ఈ ఉప ఎన్నికలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అది వారికి అడ్వాంటేజ్ అవుతుంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *