Headlines

స్ఫూర్తిగా నిలిచేలా ఆదిరెడ్డి సేవా కార్యక్రమాలు

పదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : తన పుట్టిన రోజు ఆడంబరంగా కాకుండా పదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని ఆయన అన్నారు. తిలక్ రోడ్డులోని తన నివాసం వద్ద ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భవాని చారిటబుల్ ట్రస్ట్ (బిసిటీ) తరపున 11 మందికి విద్య, వైద్యం నిమిత్తం రూ. 70 వేలు, ముగ్గురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహూకరించారు.36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో 1,000 మంది మహిళలకు చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.  తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా 43 ,  44 డివిజన్ల ప్రజలకు ఉపయోగపడేలా మల్లికార్జున నగర్లో రూ.10 లక్షల వ్యయంతో రూపొందించిన పార్కును కూడా నేడు ప్రారంభించుకుంటున్నామని ఆయన చెప్పారు‌. ఇంత వరకు రాజమండ్రి సిటీ నియోజక వర్గంలో రూ.3 కోట్ల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందచేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

The post స్ఫూర్తిగా నిలిచేలా ఆదిరెడ్డి సేవా కార్యక్రమాలు appeared first on Visalaandhra.

​పదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : తన పుట్టిన రోజు ఆడంబరంగా కాకుండా పదిమందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని ఆయన అన్నారు. తిలక్ రోడ్డులోని తన నివాసం వద్ద ఆదివారం
The post స్ఫూర్తిగా నిలిచేలా ఆదిరెడ్డి సేవా కార్యక్రమాలు appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *