Headlines

పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ

విశాలాంధ్ర – దేవరపల్లి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చెక్కు పంపిణీ కార్యక్రమం
దేవరపల్లి మండలం యర్నగూడెం ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 85 వేల రూపాయల చెక్కును వేణుగోపాల సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు సంఘ సభ్యులకు శనివారం అందించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సహకార సంఘాల ద్వారా కూడా రుణాలను మంజూరు చేసి ఉన్నతికి తోడ్పాటు అందిస్తామని సుబ్బరాజు తెలిపారు. అర్హులైన మత్స్యకార సహకార సంఘాల ద్వారా మత్స్య కారుల జీవనోభివృద్ధికి మరియు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని యర్నగూడెం మత్స్య కార సొసైటీ అభివృద్ధికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలను ఎన్సిడిసి ద్వారా మంజూరు చేయడం జరుగుతుందని ముందుగా సాంకేతిక పరికరాలకు ఆఫీసు నిర్వహణ నిమిత్తం 85 వేలరూపాయలను అందించడం జరిగిందని మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారిణి పి కృష్ణవేణి అన్నారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్ జూనియర్ కళాశాల చైర్మన్ గద్దె శ్రీనివాస్ ఎఫ్ ఎఫ్ పీఓ కోఆర్డినేటర్ రాజు సంఘ అధ్యక్ష కార్యదర్శులు ముంగర అయ్యన్న గనుసుల సుబ్బారావు విలేజ్ ఫిషరీస్ ఇంచార్జ్ టి చక్రవర్తి సంఘ సబ్యులు పాల్గొన్నారు.

The post పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – దేవరపల్లి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చెక్కు పంపిణీ కార్యక్రమందేవరపల్లి మండలం యర్నగూడెం ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 85 వేల రూపాయల చెక్కును వేణుగోపాల సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు సంఘ సభ్యులకు శనివారం అందించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సహకార సంఘాల ద్వారా కూడా రుణాలను మంజూరు చేసి ఉన్నతికి తోడ్పాటు అందిస్తామని
The post పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *