
శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు.”రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీసత్యసాయిబాబా మందిరం లో ఆదివారం ఉదయం జరిగిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శతజయంతి వేడుకల భాగంగా నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని ముందుగా శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులు తెలిపారు. అనంతరం భక్తులతో కలిసి భజనల్లో పాల్గొని, సాయి సేవా సంస్థలు వివిధ సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమం ఆల్కాట్ గార్డెన్స్, రాజమహేంద్రవరం లోని శ్రీ సత్యసాయి మందిరం ప్రాంగణంలో నిర్వహించబడింది. శతజయంతి వేడుకల సందర్భంగా కలెక్టర్ చేతులతో ప్రత్యేక కేక్ కట్ చేయడం జరిగింది. శ్రీసత్యసాయి సేవా సమాజము ఆధ్వర్యంలో, శ్రీ సత్యసాయి మందిరం, శ్రీ సత్య సాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాల పరిసరాల్లో ప్రతి నెలా నిర్వహించే భజన–ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న ప్రతి నెల రెండవ ఆదివారం మరియు నాల్గవ ఆదివారం సాయంత్రం 4:50 గంటల నుంచి 5:45 గంటల వరకు జరిగే సద్వినియోగ ఆధ్యాత్మిక–సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను కలెక్టర్ కు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు, సెక్రటరీ, సేవాదళ ప్రతినిధులు , భక్తులు, గురుకులం టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
The post సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra.
శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు.”రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీసత్యసాయిబాబా మందిరం లో ఆదివారం ఉదయం జరిగిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కలెక్టర్
The post సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra.
