Headlines

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే కాదని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఉచిత స్కాలర్షిప్లు, రిజర్వేషన్లు అంతకంటే కాదని అంబేడ్కర్ సమానత్వాన్ని కాంక్షించారన్నారు. జనాభాలో పదిశాతం ఉన్న అగ్రవర్ణాలకు, తొంబైశాతం ఉన్న అణగారిన వర్గాలకు మధ్య ఒక స్పష్టమైన సైద్దాంతిక గీత గీశారన్నారు. అసమానతలను పెంచి పోషించాలనుకునే అగ్రవర్ణ సమాజానికి, సమసమాజం, ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలు కావాలనుకునే అణగారిన సమాజానికి మధ్య ఃసామాజిక రాజకీయ సాంస్కృతిక భావజాల పోరాటం చేశారని గుర్తు చేశారు. భారత ప్రజలందరి మధ్యా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్య, గణతంత్ర భావాలు విరజిల్లాలని కలలను రాజ్యాంగంలో పొందుపరిచాడని కొనియాడారు. బ్రిటిష్ పాలకులపై రాజీపడని స్వాతంత్య్ర పోరాటం సాగిస్తూనే, మరోపక్క నాటి అగ్రవర్ణ నాయకులతోనూ అంతే స్థాయిలో తీవ్ర పోరాటం చేసిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు. స్వాతంత్ర్యానంతరం అగ్రవర్ణాల వారే పాలకులై, అణగారిన వర్గాలను బానిసలుగా మార్చకూడదని భావించాడన్నారు. అంతటి విశాల భావాలు ఉన్నవాడు కాబట్టే అంబేద్కర్ వర్ధంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఓటు అనే వజ్రాయుధాన్ని రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ప్రజలకందించాడు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారంలోకి రావాలని ఆకాంక్షిం చాడు. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఏదో హడావిడి చేయడం కాదు. ఃరాజ్యాధికారంతో సమాజాన్ని మార్చడం. సమాజంతో రాజ్యాధికారానికి రావడం-దీన్ని పునరావృతమయ్యేలా సామాజిక పరివర్తన చేయడమే అంబేడ్కర్కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

The post ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే
The post ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *