విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ గా కొల్లి రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్భాం, జనరల్ సెక్రెటరీగా శివుకు బంగారయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరజాపుపేట, వైస్ ప్రెసిడెంట్ గా డి.వి. సూర్యనారాయణ, ట్రెజరర్ గా ఏ . సత్యనారాయణ, జాయింట్ సెక్రెటరీగా షేక్ హుస్సేన్, డివిజనల్ ప్రెసిడెంట్లుగా పైల శ్రీనివాసరావు, పి .శ్రీనివాస్, ఎల్. గోవిందరావు, డివిజనల్ సెక్రటరీలుగా ఎస్. ఉమామహేశ్వరరావు, వెంకట నాయుడు, కే .శివ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కొత్త కార్యవర్గం ప్రథమ సమావేశంలో రాష్ట్ర మరియు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గణిత ఉపాధ్యాయులను సత్కరించడం జరిగింది. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్ధాంతం త్రినాధ రావు, జి ఎస్ కాంతారావుని మరియు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు కె రామకృష్ణ, బి ఆనంద్ రావు, రమాదేవిని సత్కరించడం జరిగింది. అలాగే పదో తరగతి విద్యార్థుల నూరు శాతం ఉత్తీర్ణతకు కార్యాచరణ, బ్లూప్రింట్ చర్చించడం జరిగింది. జాతీయ గణిత దినోత్సవానికి సంబంధించి విద్యార్థులకు నిర్వహించబోయే గణిత పోటీల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు
గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు



