భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ట్రెక్కింగ్ నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ప్రకృతి పట్ల అవగాహన కలుగుతుంది అని తెలియజేశారు. ఈ జిల్లా ట్రైనింగ్ కౌన్సిలర్ గుండి జానకీ రాము, స్కౌట్స్ మాస్టర్ గుండి యశోద కుమార్, తట్టుతర జోవిన్ పిళ్ళై, మల్లిపూడి చందు, ఆర్. సునీత, పలు పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

