సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ వీరి ఆదేశాల మేరకు బయో కెమిస్ట్రీ విభాగ అధిపతి మరియు రేంజర్స్ లీడర్ డాక్టర్ మేరీ అనుపమ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ ఎండి రెహమతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవసతు ఎవరికైనా ఏమి అయినా ప్రమాదం జరిగితే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళడానికి మందు చేసే చికిత్స ప్రథమ చికిత్స ప్రతి ఒక్కరు ప్రథమ చికిత్స నేర్చుకోవడం జీవితంలో ఎంతో ముఖ్యం అని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ ప్రథమ చికిత్స ప్రోగ్రామ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి మాత్రమే కాదు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనింగ్ కౌన్సిలర్ గుండి జానకీ రాము,డాక్టర్ భాస్కర్ సుధా, డాక్టర్ జయలక్ష్మి,మౌసమి, రేంజర్ టీమ్ మరియు కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్
