Headlines

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ చైర్ పర్సన్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం వలన విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందనీ, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమాజ సేవ పట్ల అవగాహన కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్ రోవర్స్ సి హచ్ దేశాయ్, జిల్లా ట్రైనింగ్ కౌన్సిలర్ గుండి జానకీ రాము, స్కౌట్స్ మాస్టర్ ఎల్. బ్రాహ్మ లింగం తది తరులు పాల్గొన్నారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *