ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు
అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, మిత్రులు ,మనవరాలుతో కేకు కట్ చేసి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పివికే కే పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. వై మునికృష్ణారెడ్డి, బాలాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కె. చంద్రశేఖర్ రెడ్డి, బాలాజీ డిఈడి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. వీర ప్రకాష్, పీవీకేకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జి. రాఘవేంద్ర ప్రసాద్ , ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా .బండి రమేష్ బాబు, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ డా. సుబ్బారావు, మన్మధేశ్వర్ రెడ్డి, అధ్యాపక బృందం, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పుష్పగుచ్చం, పండ్లు అందజేశారు.
అనంతపురం ,సత్యసాయి ఉమ్మడి జిల్లాల నుంచి పల్లె అభిమానులు ,టీడీపీ కుటుంబ సభ్యులు,బీజేపీ, జనసేన కార్యకర్తలు, పుట్టపర్తి నియోజవర్గ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాది మంది వాహనాల్లో తరలివచ్చి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి కి భారీ ఎత్తున గజమాలలు,పూలమాలతో అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు, అధికారులు ,వివిధ ప్రముఖులు,పల్లె అభిమానులు భారీగా తరలిరావడంతో పల్లె నివాసం అత్యంత జనసంద్రంగా మారింది. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినం సందర్భంగా అక్కడికి విచ్చేసిన వారందరికి అల్పాహారం, తేనీటి విందు ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రి, అనాధాశ్రమం లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
The post అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra.
ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి
The post అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra.
