మండల ఇంచార్జి ఎంపిఎం…రవిందర్
నవతెలంగాణ – మల్హర్ రావు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్ఎస్) ద్వారా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించిన 10వ తరగతి,ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తేదీ ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించినట్లుగా మండల ఇంచార్జి ఏపీఎం రవిందర్ తెలిపారు.ఇందుకుగాను దరఖాస్తులకు ఆహ్వానం పలికినట్లుగా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి చదవడానికి ఆగస్టు 31 2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసినవారు,ఇంటర్మీడియట్ చదవడానికి 10వ తరగతి పాస్ అయినవారు, కనీసం 15 సంవత్సరాలు వయస్సు ఉండాలని తెలిపారు.ఇది రెగ్యులర్ స్కూల్/కాలేజీకి వెళ్ళలేని వారికి మంచి అవకాశమన్నారు.10వ.తరగతి,ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ప్రభుత్వం గుర్తించిన సర్టిఫికెట్లు లభిస్తాయన్నారు.ఆ సర్టిఫికెట్లతో ఉన్నత చదువులు,ఉద్యోగాలు, టెక్నికల్ కోర్సులు చేసుకోవచ్చని సూచించారు.ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సైన్స్, గణితం, సామాజిక శాస్త్రం, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు నేర్చుకోవచ్చన్నారు.ఇందుకు కావలసిన పత్రాలు పుట్టినతేది ధృవీకరణ పత్రం,టిసి,మార్క్ మెమో,ఇంటర్మీడియట్ అడ్మిషన్‌కి కులం/రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అవసరమన్నారు.10వ తరగతికి పిజు రూ.1150,ఇంటర్మీడియట్ కు రూ.1500 లన్నారు. చదువు ఆగిపోయినవారు, మళ్లీ మొదలు పెట్టాలని ఆశపడుతున్న వారికీ మంచి సదవకాశమన్నారు.అర్హతలు కలిగిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.పూర్తి వివరాలకు మండల ఐకెపి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
The post ఓపెన్ స్కూల్…దరఖాస్తులకు ఆహ్వానం.! appeared first on Navatelangana.
మండల ఇంచార్జి ఎంపిఎం…రవిందర్నవతెలంగాణ – మల్హర్ రావు.తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టిఓఎస్ఎస్) ద్వారా విద్యా సంవత్సరం 2025-26కు సంబంధించిన 10వ తరగతి,ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తేదీ ఈనెల 24 వరకు ప్రభుత్వం పొడిగించినట్లుగా మండల ఇంచార్జి ఏపీఎం రవిందర్ తెలిపారు.ఇందుకుగాను దరఖాస్తులకు ఆహ్వానం పలికినట్లుగా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.10వ తరగతి చదవడానికి ఆగస్టు 31 2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసినవారు,ఇంటర్మీడియట్ చదవడానికి 10వ తరగతి పాస్ అయినవారు, కనీసం 15 సంవత్సరాలు వయస్సు
The post ఓపెన్ స్కూల్…దరఖాస్తులకు ఆహ్వానం.! appeared first on Navatelangana.
