Headlines

‘కాంతార’కి మించి..

2022లో విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టించింది. పాన్‌-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బెంచ్‌మార్క్స్‌ క్రియేట్‌ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్‌ మైల్‌ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హోంబలే ఫిలింస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ‘కాంతార: చాప్టర్‌ 1’ ఒకటి. ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించాం. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో 25 ఎకరాల్లో పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజులపాటు షూటింగ్‌ చేశాం. రిషబ్‌ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఆయన నట విశ్వరూపాన్ని మరోమారు చూడ బోతున్నాం. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది అని మేకర్స్‌ అన్నారు.

The post ‘కాంతార’కి మించి.. appeared first on Navatelangana.

​2022లో విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సష్టించింది. పాన్‌-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బెంచ్‌మార్క్స్‌ క్రియేట్‌ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్‌ మైల్‌ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘కాంతార: చాప్టర్‌ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్‌ అధికారికంగా
The post ‘కాంతార’కి మించి.. appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *