పి. శ్రీకుమారన్
కేరళలో శబరిమలై కొండపైగల ఆలయానికి సమీపంలో ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కు అనుమతివ్వడానికి కేరళ హైకోర్టు అనుమతించింది. అయితే పంపానది ఒడ్డున ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి అనుమతించాలన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విజ్ఞప్తిని కేరళ కోర్టు అనుమతించగా రాష్ట్రప్రభుత్వం అనుమతించరాదన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకూడదని తెలిసింది. ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు అనుమతిని తిరస్కరించడం ఇది రెండవసారి. పంపానది ఒడ్డున ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడం కేవలం వాణిజ్యం కోసమేనని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కొన్ని షరతుల మేరకు సంగమంను అనుమతిస్తూ హైకోర్టు సెప్టెంబరు 11న తాత్కాలిక ఉత్తర్వులు జారీచేసింది.
హైకోర్టు తాత్కాలికంగా అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులో మేము జోక్యం చేసుకోవడంలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రపంచ అయ్యప్ప సంగమం ఉత్సవాన్ని నిర్వహించడానికి హైకోర్టు కొన్ని షరతులను విధించింది. హైకోర్టు సి.ఎస్ నరసింహ నాయకత్వంలోని ధర్మాసనం అనుమతించడానికి సంబంధించిన అన్ని ప్రశ్నలు బహిరంగంగానే ఉన్నాయని అందువల్ల ఇతర అంశాలను ప్రస్తావించవలసిన అవసరం లేదని తెలిపింది. పంపానది ఒడ్డున ఉత్సవం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ 2022లో కేరళ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలుచేసింది. ప్రభుత్వం తరఫున భక్తులైన న్యాయవాదులు విసి అజిత్‌కుమార్, టిఎస్ మహేంద్రకుమార్, అజీష్ కలథిల్ గోపిలు పిటిషన్ దాఖలుచేశారు. ప్రతికూలించిన సంగమం పూర్తిగా వాణిజ్య కార్యకలాపం. అందువల్ల అనుమతించరాదని పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. అయ్యప్ప ఆలయానికి సమీపంలో పంపానది ఒడ్డున ఇలాంటి వాణిజ్యాన్ని నిర్వహిండం సరైందికాదని పిటిషనర్లు తెలిపారు. కేవలం సంపాదనకే సంగమం ప్రతిపాదన చేశారని పిటిషనర్లు వాదించారు. ఈ సంగమం మతం లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాలతో ఏమాత్రం సంబంధం లేదని వారు తెలిపారు.
సెప్టెంబరు 20వ తేదీన సంగమం కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీడీబీ, వారి అధికారులు, ఏజంట్లను అనుమతించరాదని పిటిషనర్లలో ఒకరు సుప్రీంకోర్టును కోరారు. అలాగే సంగమం కార్యక్రమం దేవత పేరుతో నిర్వహించడానికి ఆలయం నిధులను, ఆస్తులను, సేవలను సైతం అనుమతించకూడదని ఆయన సుప్రీంకోర్టును కోరారు. తుదితీర్పునకు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారణ చేయాలనికోరగా, ఇంకా అది పెండిరగ్‌లో ఉంది. ట్రావెన్‌కోర్‌కొచ్చిన్ హిందు మత సంస్థల చట్టం 1950ని ఉల్లంఘిస్తూ హైకోర్టు ఉత్తర్వుజారీ చేసిందని లాయర్ మహీంద్రకుమార్ అభ్యంతరం తెలిపారు. సంగమం ప్రతిపాదనపెట్టిన వారి వాదాన్ని ఉన్నతస్థాయి కోర్టు తిరస్కరించింది. ఇది కేవలం తాత్కాలిక ఉత్తర్వు. మేము ఎందుక జోక్యం చేసుకోవాలి? సంగమం నిర్వహణకు వారికి అధికారం ఎక్కడ ఉంది? అది నిర్వహించడం సరైందని ఎక్కడ చెప్పారు హైకోర్టు దీనిని పరిశీలిస్తుంది అని న్యాయమూర్తి నరసింహ ప్రశ్నించరు. సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎల్‌డిఎఫ్ చేతిలో ఆయుధమైంది. అంతేకాదు, సుప్రీంకోర్టు ఉత్తర్వు హిందుత్వ గ్రూపునకు తీవ్రమైన దెబ్బ తగిలింది. సంగమం నిర్వహించడానికి అనుమతించేదిలేదని ప్రభుత్వం కచ్చితంగా తెలిపింది. శబరిమల భవిష్యత్తు అభివృద్ధికి ఇది ఆటంకమవుతుందని, అలాగే ప్రపంచ భక్తుల కేంద్రాన్ని ఆటంకపరుస్తుందని గతంలో ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సుప్రీంకోర్టు సమర్థించినట్లయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వును దేవాదాయ, ధర్మాదాయ శాఖమంత్రి విఎన్ వాసన్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో అయ్యప్ప భక్తులు వచ్చి తమ మొక్కులను తీర్చుకునేందుకు అన్ని కార్యక్రమాలను నెరవేర్చుకునేందుకు ఒక వేదిక అవుతుందని అన్నారు. శబరిమలైలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచేందుకు పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందని మంత్రి అన్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు సైతం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చే అవకాశం ఉంటుందని భక్తుల యాత్రాకేంద్రంగా మార్చడానికి ఆయా ఆలయాల సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. టీడీబీ వజ్రోత్సవంలో భాగంగా సంగమంను నిర్వహించాలని తలపెట్టారు. ఈ ఉత్సవాలను మూడు వేదికలలో జరుపుతారు. కనీసం 3000 మందికిపైగా భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ప్రభుత్వం ఈ ప్రణాళికలను వాస్తవంగా అనుమతించినట్లయితే అంచనావేసిన దానికంటే రెట్టింపు భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని కేరళ సెక్యులర్‌బహుళ నైతికతలకు చిహ్నమని మంత్రి తెలిపారు. సంఫ్‌ుపరివార్ గ్రూపులో చీకట్లు అలుముకున్నాయి. సంగమం నిర్వహించడం ద్వారా నిధులు సమీకరించవచ్చునన్న ఆశ సంఫ్‌ుపరివార్‌కు ఏర్పడిరది. 2018లో శబరిమలై ఆలయంలో మహిళలుసైతం ప్రవేశించవచ్చునన్న సుప్రీంకోర్టు తీర్పునుకూడా వ్యతిరేకించిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు సంగమం ఉత్సవాన్నికూడా బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. దీనితో హిందుత్వ గ్రూపునకు మద్దతు, ఉత్సాహాన్ని కలుగచేయడంతో కోర్టు తీర్పు విఫలమైంది. శబరిమలైకు సంబంధించిన వ్యవహారాలలో ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని నాయర్ సర్వీసు సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్)కి ఎదురుదెబ్బ అయింది. ప్రభుత్వ వైఖరి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఉత్సాహాన్ని కలిగించింది. ఈ నేపధ్యంలో సెప్టెంబరు 20న శబరిమలై ఆలయంలో ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా సంఫ్‌ుపరివార్ ఆశలు నెరవేరలేదు.
The post కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎదురుదెబ్బ appeared first on Visalaandhra.
పి. శ్రీకుమారన్ కేరళలో శబరిమలై కొండపైగల ఆలయానికి సమీపంలో ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) కు అనుమతివ్వడానికి కేరళ హైకోర్టు అనుమతించింది. అయితే పంపానది ఒడ్డున ప్రపంచ అయ్యప్ప సంగమం నిర్వహించడానికి అనుమతించాలన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విజ్ఞప్తిని కేరళ కోర్టు అనుమతించగా రాష్ట్రప్రభుత్వం అనుమతించరాదన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోకూడదని తెలిసింది. ఈ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు అనుమతిని తిరస్కరించడం ఇది రెండవసారి. పంపానది ఒడ్డున
The post కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎదురుదెబ్బ appeared first on Visalaandhra.
