Headlines

దస్తావేజు లేఖరుల నూతన కార్యవర్గం ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దస్తావేజు లేకరులు వారి సహాయకుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా కృష్ణాపురం జావిద్ భాష, ఉపాధ్యక్షులుగా బారు భాస్కర్, కార్యదర్శిగా జూటూరు మహేంద్ర, సహకార దర్శిగా తొండమాల నాగార్జున, కోశాధికారిగా సింగేటి మల్లికార్జున ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జావిద్ భాష మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న నా తోటి దస్తావేజు లేఖరులకు ,సహాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యంగా దస్తావేజు లేఖరుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని సహాయకులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారు వృత్తి పట్ల ఏ సమస్యలు ఉన్నా వారికి సలహాలు సూచనలు అందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దస్తావేజులేఖరులు అల్లం రామాంజి, బాలాజీ, వాజిద్ ,గోపి, కామనూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

The post దస్తావేజు లేఖరుల నూతన కార్యవర్గం ఎంపిక appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దస్తావేజు లేకరులు వారి సహాయకుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా కృష్ణాపురం జావిద్ భాష, ఉపాధ్యక్షులుగా బారు భాస్కర్, కార్యదర్శిగా జూటూరు మహేంద్ర, సహకార దర్శిగా తొండమాల నాగార్జున, కోశాధికారిగా సింగేటి మల్లికార్జున ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు జావిద్ భాష మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న నా తోటి దస్తావేజు లేఖరులకు ,సహాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ముఖ్యంగా
The post దస్తావేజు లేఖరుల నూతన కార్యవర్గం ఎంపిక appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *