భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున సముద్ర జలాల పరిశుభ్రతలో భాగంగా విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఎరడ బీచ్ నందు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రతతో చుట్టూ పక్కల ఉన్న ప్రజలకు, పర్యాటకులకు బీచ్ కాలుష్యం వాళ్ళ వచ్చే అనర్థాలు గురించి తెలియజేశారు. జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ సముద్రాలను పరిరక్షించడం ప్రతి ఒకరి బాధ్యత అని, ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలు సముద్రంలో కలవడం వలన జలాలు కలుషితం అవుతున్నాయని అన్నరు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ చైర్ పర్సన్ పి. కిషన్ కుమార్, గైడ్ కెప్టెన్లు సునీత, దేవి, భవాని, జయంతి మరియు ఆదర్శ రాయల్ విద్యలై మరియు శ్రీ సాయి వెంకటేశ్వర స్కూల్ నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత దాసరి వేణుగోపాల్ (LT)
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బీచ్ పరిశుభ్రత దాసరి వేణుగోపాల్ (LT)
