Headlines

Air Traffic: నైట్​డ్యూటీలో నిద్రపోయిన సిబ్బంది.. గంటసేపు గాల్లోనే విమానం

Air Traffic Controller Asleep Plane Circles For An Hour Ajaccio Airport

ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్​ఇటలీలోని అజాసియో ఎయిర్​పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్​దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైన్​క్లియర్​ మెసేజ్​ఇవ్వాల్సి ఉంది. కానీ ఎయిర్​ పోర్టు టవర్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో పైలట్​విమానాన్ని కిందకు దించలేకపోయాడు. ఎయిర్​ ట్రాఫిక్‎ను కంట్రోల్​చేయాల్సిన సిబ్బంది నైట్​డ్యూటీలో నిద్రపోవడంతో ఓ విమానం దాదాపు గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.

రన్​వేపై ల్యాండింగ్‎కు అనుమతి రాకపోవడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే గంటపాటు ఉంచాల్సి వచ్చింది. దీంతో ఎయిర్​పోర్టు ఫైర్ డిపార్ట్​మెంట్ సిబ్బంది అప్రమత్తమై ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‎కు వెళ్లి చూడడంతో.. అక్కడ ఉన్న సిబ్బంది గాఢ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం వారిన నిద్రలేపి రన్​వేపై లైట్లను ఆన్​చేసి ఫ్లైట్​ల్యాండింగ్​కు అనుమతి ఇచ్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్​అవడంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

​ఎయిర్ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సిన సిబ్బంది నైట్ డ్యూటీలో నిద్రపోయారు. దీంతో ఓ విమానం గంటసేపు గాల్లోనే తిరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తమై ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం అందించి.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణీకులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్​ఇటలీలోని అజాసియో ఎయిర్​పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్​దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *