Headlines

Dussehra Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అదనంగా మరో రెండు రోజులు సెలవులు..

Dussehra Holidays 2025 For Schools In Ap For Two Additional Days

Dussehra Holidays 2025: దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొదట పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన సర్కార్.. అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయి.. కానీ, పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు… ఇక, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా పండుగ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు అంటే.. మొత్తంగా 11 రోజుల పాటు దసరా సెలవులు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు..

​దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *