Headlines

Mohammad Nabi: 6,6,6,6,6.. వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్!

Mohammad Nabi Smashes 5 Sixes In A Row Against Sri Lanka Asia Cup 2025

Mohammad Nabi: ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ శ్రీలంకపై చెలరేగిపోయాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నబీ, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి 19 ఓవర్ల ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ తన అనుభవాన్ని చూపించాడు.

Bunny Vasu: అల్లు అరవింద్ పుట్టిన తర్వాతనే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ అయ్యారు.!

ఇన్నింగ్స్ వెల్లాలగె వేసిన చివరి ఓవర్‌లో మొదట బంతిని లాంగ్ ఆఫ్‌ మీదకు, ఆ తర్వాత రెండు సిక్సర్లను లాంగ్ ఆన్ మీదకు కొట్టాడు. తరువాతి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా పంపాడు. మొత్తంగా వరుసగా ఐదు బంతులను సిక్సర్లుగా మార్చిన నబీ, చివరి బంతిని కూడా సిక్సర్‌గా మార్చే అవకాశం వచ్చినా.. టైమింగ్ సరిగ్గా కాకపోవడంతో ఒక్క సింగిల్‌కే పరిమితమయ్యాడు. అయినా, ఆ ఓవర్‌లోనే మొత్తం 32 పరుగులు సాధించి అఫ్గానిస్తాన్ స్కోరును పటిష్ట స్థితికి చేర్చాడు. కేవలం 20 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసిన నబీ, అఫ్గాన్ ఆటగాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌తో కలిసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డులో మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. చివరికి 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అంతేకాకుండా, నబీ నూర్ అహ్మద్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు కేవలం 18 బంతుల్లో 55 పరుగులు జోడించాడు. వీటిలో నబీ ఒక్కడే 14 బంతుల్లో 48 పరుగులు సాధించాడు.

Maoist Letter: మావోయిస్టుల హెచ్చరిక లేఖ.. భూస్వాములు, అధికార పార్టీ నాయకుల్లో గుబులు!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో 170 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 18.4 ఓవర్లలో ఛేదించడంతో.. ఆఫ్ఘనిస్తాన్ ట్రోని నుండి నిష్క్రమించింది. గ్రూప్ B నుండి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4కు అర్హత సాధ్హించాయి.

​Mohammad Nabi: ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ మహమ్మద్ నబీ శ్రీలంకపై చెలరేగిపోయాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నబీ, శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్‌లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి 19 ఓవర్ల ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *