నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ హైవేపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి నిఘా పెంచారు. ఉధంపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం డోన్ల ద్వారా అన్వేషణ సాగించామని, వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్ కౌంటర్‌తో భద్రతా బలగాలు అప్రమత్తమైయ్యాయి. జమ్ముకశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో కశ్మీర్ లోయలోని శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం తనిఖీలు నిర్వహించింది.
The post జమ్ములో హై అలర్ట్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ హైవేపై భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి నిఘా పెంచారు. ఉధంపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం డోన్ల ద్వారా అన్వేషణ సాగించామని, వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ
The post జమ్ములో హై అలర్ట్ appeared first on Navatelangana.
