Headlines

పూల పండుగ ప్రారంభం.!

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ పుడమి ఒడిలోపురుడుపోసుకున్న పూలను పూజించే పూల పండగే బతుకమ్మ పండగా పిలుపునిచ్చారు. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. ఆదివారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బతుకమ్మ

బతుకమ్మ పండగను ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముఖ్యంగా గునుగు , చామంతి, తంగేడు, ఎర్ర గన్నేరు, బంతి పూలను బతుకమ్మ తయారు చేయడంలో వాడతారు. బతుకమ్మ తయారు చేయడానికి గుమ్మడి ఆకులను పళ్లెంలో వేసి వాటిపై అందంగా పూలను పేరుస్తారు. చివరగా.. మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. గౌరమ్మను దేవతగా భావిస్తారు.

The post పూల పండుగ ప్రారంభం.! appeared first on Navatelangana.

​నవతెలంగాణ – మల్హర్ రావుతెలంగాణ పుడమి ఒడిలోపురుడుపోసుకున్న పూలను పూజించే పూల పండగే బతుకమ్మ పండగా పిలుపునిచ్చారు. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. ఆదివారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు
The post పూల పండుగ ప్రారంభం.! appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *