Headlines

రేపటి నుంచి సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు

నవతెలంగాణ – వనపర్తి 
సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 21న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న 11వ సెపక్తక్రా టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శనివారం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని గతంలో ఉన్న పది జిల్లాల పరిధిలో మొత్తం 20 టీములు ఈ పోటీల్లో పాల్గొంటారని 10 టీములు మహిళలు 10 టీంలు పురుష క్రీడాకారులు సెపక్తక్రా టోర్నమెంటులో పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ క్రీడా పోటీలకు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లాలోని క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సెపక్తక్రా పోటీల్లో వనపర్తి నియోజకవర్గం లోని జిల్లా ఖిల్లా గణపురం మండలానికి చెందిన జాతీయ క్రీడాకారిణి వనిత ప్రభుత్వ ఉద్యోగం సాధించిందని ఆమె కూడా ఈ క్రీడా పోటీలో పాల్గొంటూ మరోసారి జాతీయస్థాయి నేషనల్ పోటీలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో ఎంపిక అయిన క్రీడాకారులు వచ్చే నెలలో గోవాలో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ క్రీడా పోటీల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు భాస్కర్ గౌడ్, భాస్కర్ రెడ్డి, గట్టు వెంకన్న, ఉప్పల భాస్కర్, జగదీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

The post రేపటి నుంచి సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు appeared first on Navatelangana.

​నవతెలంగాణ – వనపర్తి సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 21న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న 11వ సెపక్తక్రా టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను శనివారం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని గతంలో ఉన్న పది జిల్లాల పరిధిలో మొత్తం 20
The post రేపటి నుంచి సెపక్టక్రా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *