దశాబ్ద కాలాల క్రింద
ఘోషించిన ఊహ ప్రేయసిల ఆత్మల్ని శోషించుకొని,
కణాల నిర్వాణ వాంఛల
ప్రియత్వం నుండి ఎగసిపడే
రమ్యాల్ని విధ్వంసం చేసి
నర నరాన ఫెమినిజాన్ని నింపి-
అగమ్య సద్యోగర్భంలో
వెంట వెంటనే మళ్లీమళ్లీ పుట్టి,
వేల శక్తి రూపాలై నవకాండల్ని సష్టిస్తాను.
నేనంటే-
మీరనుకునే శంగార మాంసపు ముద్దల్ని కాను
రగులుతున్న ఎర్రటి అగ్నిగోల ఛాయల్ని !
ప్రబంధ కవుల స్మశానం వద్ద
నా ఎజెండా ప్రస్తావించి,
ఆమెలో అతని ప్రథల్ని తీసేసి
భవిష్యత్ లో చరిత్ర లేకుండా చేస్తాను
ఎవరికోసమో, ఎవరి వలనో
కశించి, సహించే పరిచారిని కాను
మళ్లీ –
రామాయణ, భారతాలను మొదలెట్టాల్సి వస్తే
ఇప్పుడు నేను- ప్రాచీన సీతను కాను,
ప్రబంధ కన్యను కాను !
ప్రతిధ్వనించే ఆధునిక పాంచాలిని !!
- గడ్డం లింగస్వామి, 9010081146
The post సహించే పరిచారిని కాను appeared first on Navatelangana.
దశాబ్ద కాలాల క్రిందఘోషించిన ఊహ ప్రేయసిల ఆత్మల్ని శోషించుకొని,కణాల నిర్వాణ వాంఛలప్రియత్వం నుండి ఎగసిపడేరమ్యాల్ని విధ్వంసం చేసినర నరాన ఫెమినిజాన్ని నింపి-అగమ్య సద్యోగర్భంలోవెంట వెంటనే మళ్లీమళ్లీ పుట్టి,వేల శక్తి రూపాలై నవకాండల్ని సష్టిస్తాను.నేనంటే-మీరనుకునే శంగార మాంసపు ముద్దల్ని కానురగులుతున్న ఎర్రటి అగ్నిగోల ఛాయల్ని !ప్రబంధ కవుల స్మశానం వద్దనా ఎజెండా ప్రస్తావించి,ఆమెలో అతని ప్రథల్ని తీసేసిభవిష్యత్ లో చరిత్ర లేకుండా చేస్తానుఎవరికోసమో, ఎవరి వలనోకశించి, సహించే పరిచారిని కానుమళ్లీ –రామాయణ, భారతాలను మొదలెట్టాల్సి వస్తేఇప్పుడు నేను- ప్రాచీన
The post సహించే పరిచారిని కాను appeared first on Navatelangana.
