Headlines

Tirumala: టీటీడీ బోర్డు సభ్యులు సంచలన వ్యాఖ్యలు.. పరకామణిలో రూ. 100 కోట్ల చోరీ

Ttd Board Member Bhanu Prakash Reddy Alleges Rs 100 Crore Parakamani Scam In Tirumala

Tirumala: తిరుమలలోని పరకామణిలో దొంగతనం చేస్తున్న రవికుమార్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా చోరీ చేసినా డబ్బుతో కోట్లు రూపాయల రియల్ ఎస్టేట్లో పెట్టారు‌.. ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు.. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తిరుమల స్వామివారి పరకామణిలో వంద కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగింది అన్నారు. స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారు.. రూ. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు‌..‌ ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించింది.. వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నిటిని సీజ్ చేయాలని ఆదేశించిందని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Bengaluru: గుంతలపై నిరసనలు.. పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ

ఇక, అప్పట్లో కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళారు అని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో చాలా మంది వైసీపీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భాగస్వామ్యలుగా ఉన్నారు, త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయన్నారు. త్వరలో ఓ అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ రూ. 100 కోట్ల స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను బయట పెట్టబోతున్నారు.. స్వామివారి సొత్తును కీలకమైన ఓ పోలీస్ అధికారి దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు అందరికి ఇందులో వాటాలు వెళ్ళాయి.. అప్పటి అధికారులు ఈ సొమ్మును పంచుకున్నారు.. ఈ కుంభకోణం జరిగినప్పుడు చైర్మన్‌గా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు భూమన దీనికి సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, దోచుకున్న సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చారు.. ఈ ఘటన తరువాత అన్ని రకాల సాక్ష్యాలను తొలగించి, ధ్వంసం చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

​TTD Board Member Bhanu Prakash Reddy Alleges Rs 100 Crore Parakamani Scam in Tirumala  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *