ఆకలి
ఆగమంటే ఆగదు
మండుతున్న ప్రేవుల్లో
రణనినాదాలు చెలరేగుతాయి
ఉపాధి లేక
అసంతృప్తి అంతర్లీనంగా రగులుతుంటే
కప్పిపెట్ట ఎవరితరం
వ్యవస్థ నిండా
అవినీతి పేరుకుపోతుంటే
ఆమోదిస్తున్నారనుకునే పాలకులకు
హెచ్చరిక జారీ కాబోతుందనే సంకేతం
అహంకారం జూలు విదిల్చి
ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రయత్నాలు
కొద్దోగొప్పో సోషల్ మీడియా బువ్వ పెడుతుందనుకున్న జనం
వ్యసనమో నిజమో తేల్చే సమయం లేదు
తెలిసిందల్లా యువతరం బుర్రల్లో తిరుగుబాటు ధ్వని
రాజ్యమంతా వ్యాపించిన నిరసన జ్వాలలు
అధికార మదానికి చరమ గీతాలు
హింసా అహింసా మధ్యే మార్గాలు లేవు
అగ్ని కీలల్లో పాలక భవనాలు
తరిమి తరిమి కొట్టారు
రోజుల్లోనే ఎంతటి మార్పు
అది మౌలిక మార్పో కాదో
ఇదమిత్థంగా తేలదు
ఆంక్షలు దాటిన తరం ఆకాంక్షలు నెరవేరునో లేవో
కాలం వంతెన మీద సయ్యాటలే!!
- మంజుల సి హెచ్
The post ఇది విప్లవమేనా?! appeared first on Navatelangana.
ఆకలిఆగమంటే ఆగదుమండుతున్న ప్రేవుల్లోరణనినాదాలు చెలరేగుతాయిఉపాధి లేకఅసంతృప్తి అంతర్లీనంగా రగులుతుంటేకప్పిపెట్ట ఎవరితరంవ్యవస్థ నిండాఅవినీతి పేరుకుపోతుంటేఆమోదిస్తున్నారనుకునే పాలకులకుహెచ్చరిక జారీ కాబోతుందనే సంకేతంఅహంకారం జూలు విదిల్చిప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే ప్రయత్నాలుకొద్దోగొప్పో సోషల్ మీడియా బువ్వ పెడుతుందనుకున్న జనంవ్యసనమో నిజమో తేల్చే సమయం లేదుతెలిసిందల్లా యువతరం బుర్రల్లో తిరుగుబాటు ధ్వనిరాజ్యమంతా వ్యాపించిన నిరసన జ్వాలలుఅధికార మదానికి చరమ గీతాలుహింసా అహింసా మధ్యే మార్గాలు లేవుఅగ్ని కీలల్లో పాలక భవనాలుతరిమి తరిమి కొట్టారురోజుల్లోనే ఎంతటి మార్పుఅది మౌలిక మార్పో కాదోఇదమిత్థంగా తేలదుఆంక్షలు దాటిన తరం ఆకాంక్షలు
The post ఇది విప్లవమేనా?! appeared first on Navatelangana.
