Headlines

తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్ర

 నవతెలంగాణ – ఆత్మకూరు 
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులు భారీగా గుమికూడి స్వాగతం పలికారు. ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇరుసడ్ల సదానందం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ “అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు విస్మరించారు. ఇది ఉద్యమకారుల పట్ల స్పష్టమైన నిర్లక్ష్యం” అని విమర్శించారు.

రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యమకారుల హక్కుల కోసం ఫోరం మరింత బలంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. “ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి మరో పెద్ద ఉద్యమానికి నాంది పలుకుతాం” అని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్రలో భాగంగా 584 మండలాలను సందర్శించే కార్యక్రమం జరుగుతోంది. దాని లోపల ఆత్మకూరుతోపాటు మరిన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రాయరాకుల రవీందర్, మాజీ సర్పంచ్ నాగేలు సామెల్, జల్లెల రాజు, జిల్లపెళ్లి చిన్న సారయ్య, వంగేటి ప్రభాకర్, లక్కర్సు లింగమూర్తి, దుప్పటి శంకర్, తోట గణపతి, నాగేల్లి స్వామి, జన్నారపు బిక్షపతి, పులి చేరి పైడి, పెరుమళ్ళ స్వామి, తనుగుల ప్రభాకర్, తనుగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 

The post తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్ర appeared first on Navatelangana.

​ నవతెలంగాణ – ఆత్మకూరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులు భారీగా గుమికూడి స్వాగతం పలికారు. ఫోరం హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇరుసడ్ల సదానందం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. ఆయన మాట్లాడుతూ “అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామని హామీ
The post తెలంగాణ ఉద్యమకారుల బస్సు యాత్ర appeared first on Navatelangana.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *