విశాలాంధ్ర – గుమ్మగట్ట: అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలె ప్రియున్ని హత్య చేసి నీటికుంటలో పూడ్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా,చెల్లకెర తాలూకా, హీరేహళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.ఆదివారం అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన బాలరాజు(38)కు పదేళ్ల కిందట మహంతమ్మతో వివాహమైంది.వీరికి ఇద్దరు సంతానం.భార్యాభర్తల మధ్య కలహాలు జరిగి మహంతమ్మ పుట్టింటికి వెళ్లడంతో బాలరాజు కూడా దూరంగా ఉంటున్నాడు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా, చెల్లకెర తాలూకా హిరేహళ్లి గ్రామం లో కూలీ పనులకు వెళ్ళేవాడు.ఆ గ్రామంలో పరిచయమైన నాగమణి భర్త మృతి చెందడంతో ఉన్న కొద్ది పాటి పొలంలో ఆకు కూరలు,కూరగాయలు,పండించి విక్రయించి జీవనం సాగిస్తోంది. పొలంలోనే చిన్న ఇంటిని నిర్మించుకుంది. ఈ నేపథ్యంలో కూలి పనులకు వెళ్తున్న బాలరాజుతో ఆమెకు స్నేహం ఏర్పడింది. బాలరాజు రెండేళ్లుగా అక్కడే ఉంటూ వారి పొలంలో పని చేసుకుంటున్నాడు. సొంత పనుల పై నెల రోజుల కిందట తన స్వగ్రామం వీరాపురానికి వచ్చాడు. పది రోజుల కిందట నాగమణి హీరేహళ్లి గ్రామంలో జరిగే మారెమ్మ పండుగకు రావాలని అతనికి చరవాణి ద్వారా కబురు చేసింది. పండుగ కోసం హీరేహళ్లి వెళ్ళిన అతనికి నాగమణి ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించి నిలదీశాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకొన్నారు. నాగమణి ప్రతిదాడిలో బాలరాజు మృతి చెందాడు.రాత్రికి రాత్రి ఆమె పొలంలో నిర్మించిన వ్యవసాయ నీటికుంటలో గుంతను తవ్వి బాలరాజు శవాన్ని పూడ్చిపెట్టి తాను ఏమీ ఎరగనట్లు ఉంటోంది.పొలంలోని నీటికుంట వద్ద దుర్వాసన రావడంతో పక్క పొలాల్లో పనిచేస్తున్న కూలీలు,అటువైపుగా వచ్చిన గొర్రెలకాపర్లు అనుమానించి తళుకు పోలీసులకు సమాచారాన్ని అందించారు. విషయం పోలీసుల వరకు చేరడంతో హత్యోదంతం బయటపడింది.అక్కడి పోలీసులు చెల్లకెర డీఎస్పీ రాజన్న, సీఐ హనుమంతప్ప, ఎస్సై శివకుమార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా కోసం చెల్లకెర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.నిందితురాలి పై కేసు నమోదు చేశారు.
The post ప్రాణం తీసిన అక్రమ సంబంధం.. appeared first on Visalaandhra.
విశాలాంధ్ర – గుమ్మగట్ట: అక్రమ సంబంధం కారణంగా ప్రియురాలె ప్రియున్ని హత్య చేసి నీటికుంటలో పూడ్చిన సంఘటన చిత్రదుర్గ జిల్లా,చెల్లకెర తాలూకా, హీరేహళ్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.ఆదివారం అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన బాలరాజు(38)కు పదేళ్ల కిందట మహంతమ్మతో వివాహమైంది.వీరికి ఇద్దరు సంతానం.భార్యాభర్తల మధ్య కలహాలు జరిగి మహంతమ్మ పుట్టింటికి వెళ్లడంతో బాలరాజు కూడా దూరంగా ఉంటున్నాడు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా, చెల్లకెర తాలూకా
The post ప్రాణం తీసిన అక్రమ సంబంధం.. appeared first on Visalaandhra.
