Headlines

Asia Cup 2025: నువ్వా.. నేనా.. సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ పోరు

Asia Cup 2025 India Vs Pakistan Super 4 Clash Live Updates

Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్‌ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని అనుకుంటున్నాం. ఒక్కో మ్యాచ్‌పైనే మా దృష్టిని కేంద్రీకరిస్తున్నాం” అని అన్నారు.

ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ తలపడటం ఇది రెండోసారి. గ్రూప్ A లో జరిగిన గత మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఆధిపత్యం చాటుకుంది. ఇప్పుడు, మరోసారి ఇరు జట్లు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి టోర్నమెంట్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరువవుతుంది. ఇక నేటి లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూసేద్దాం..

​Asia Cup 2025: ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించి సూపర్ ఫోర్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు పాకిస్తాన్‌తో జరిగే కీలకమైన సూపర్ ఫోర్ మ్యాచ్‌ కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మేము ఉత్తమంగా ఏమి చేయగలమో దానిపై దృష్టి పెడుతున్నాం. గత రెండు మూడు మ్యాచ్‌లలో మేము అనుసరిస్తున్న మంచి అలవాట్లన్నింటినీ పాటించాలని  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *